మహారాష్ట్రను గత రెండు రోజులుగా భారీవర్షాలు కుదిపేస్తున్నాయి. దీంతో థానే పట్టణం, పాల్ఘర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో గురువారం ఉదయం పాల్ఘర్ జిల్లాలో కొల్గావ్ బ్రిడ్జి కూలిపోయింది. వంతెన కుప్పకూలడంతో చుట్టుపక్కల గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ముంబ్రాలోని పన్వెల్ -కల్వా రహదారి, ముంబ్రా బైపాస్ రోడ్డు వద్ద భారీవర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సహాయబృందాలు కొండచరియలను తొలగిస్తున్నాయి. థానే నగరంలో భారీవర్షాల వల్ల మూడు వేర్వేరు ప్రాంతాల్లో ప్రహరీ గోడలు కూలడంతోపాటు, చెట్లు విరిగి పడటంతో ఆరు వాహనాలు దెబ్బతిన్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement