Tuesday, November 26, 2024

Rain Alert: తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు తెలిపింది. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణవైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి రూరల్, రామచంద్రాపురం, చంద్రగిరి,పాకాల మండలాల్లో వర్ష భీభత్సం సృష్టించింది. నక్కలేరు వాగు ప్రవాహంతో కొత్తనెన్నూరు గ్రామం ప్రమాదంలో చిక్కుకుంది. పంటపొలాలను ముంచెత్తుతూ ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామచంద్రాపురం నుంచి తిరుపతికి రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement