తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను కూడా దాటుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అయితే, ఇప్పుడు వాతావరణంలో స్వల్ప మార్చు చోటు చేసుకుంది.
వచ్చే రెండు రోజులు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో తేలిక పాటి నంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురుస్తామని వెల్లడించింది. రేపు మాత్రం రాష్ట్రంలో పొడివాతావరణ నెలకొని ఉండే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతా నుంచి తెలంగాణ మీదుగా దక్షిన తమిళనాడు వరకు సముద్రమట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ రోజు ఇది బలహీన పడినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.