రానున్న మూడు రోజుల్లో ఏపీతో పాటు తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ నైరుతి మధ్య బంగాళాఖాతంలో ఏపీ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్రమట్టానికి 8.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 9 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలు రైతులను తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వరి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లుతోంది. పలు ప్రాంతాల్లో ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందిన పంట నీటిపాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Zika virus outbreak: ఉత్తర్‌ప్రదేశ్‌లో జికా కలకలం.. 66 మందికి వైరస్