Wednesday, November 20, 2024

రాగల మూడు రోజులు వెూస్తరు వర్ష సూచన..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ద్రోణి విదర్భ నుండి తెలంగాణ మీదగా ఉత్తర మధ్య కర్ణాటక వరకు విస్తరించినట్లు పేర్కొంది. దీంతో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుండి40 కి మీ వేగంతో గాలి వీస్తుందని చెప్పింది. ఉపరితల ద్రోణి సముద్ర మట్టం నుంచి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతోందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి వరి చేలు కోతలకు సిద్ధమయ్యాయి.

వరికోత మిషన్లు దిగబడకుండా తిరిగేందుకు వీలుగా మడులకు రైతులు నీరు నిలిపేశారు. మరో ఒకటి రెండు రోజులు వర్షాలు కురవకపోతే ఈ వారంతానికి కోతలు ముమ్మరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాలకు తోడు వడగళ్లు కూడా పడితే రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయే ప్రమాదం నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement