తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, నిన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement