తెలంగాణలో నేడు, రేపు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి కర్ణాటక వరకు వరకు గాలుల్లో ఏర్పడిన అస్థిరత కారణంగా ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం వివరించింది.
మరోవైపు నేటి నుంచి నాలుగు రోజులపాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వడగాలులు వీచే అవకాశం ఉండడంతో మధ్యాహ్నం పూట బటయకు రాకుండా ఉండడమే మేలని హెచ్చరించింది. కాగా, నిన్న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అత్యధికంగా 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు పేర్కొంది.