Friday, November 22, 2024

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

తెలంగాణలో నేటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి మధ్యప్రదేశ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ నివేదికలో పేర్కొన్నారు. మధ్య మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ మీదుగా ఈ ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించారు. దీని ప్రభావంతో తెలంగాణలో  నేడు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర– దక్షిణ ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనికి తోడు రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. రాయలసీమలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement