తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటి వరకు కురిసిన వర్షాలకే వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రాజెక్టులు, నదుల్లోకి వరద పెరిగింది. లోతుట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఈరోజు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే బుధ, గురు వారాల్లో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.