కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో రైల్వే ఆస్తులు భారీగా దెబ్బతిన్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. ఆస్తుల ధ్వంసం, నిప్పుపెట్టడం వంటి ఆందోళనలతో పాటు.. రైళ్లు నిలిచిపోవడం వల్ల రైల్వేకు దాదపు రూ.259.44 కోట్ల నష్టం వాటిల్లిందని శుక్రవారం పార్లమెంట్లో వెల్లడించారు.
ఈ ఏడాది రైల్వే ఆస్తులధ్వంసం కారణంగా భారతీయ రైల్వే రూ. 259.44 కోట్ల నష్టాన్ని చవిచూసిందని రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. అగ్నిపథ్ స్కీమ్ ప్రారంభించిన తర్వాత జరిగిన ఆందోళనల ఫలితంగా రైల్వే సేవలకు అంతరాయం కలిగిందని, దీంతో ప్రయాణికులకు రీఫండ్ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. అయితే, జూన్ 14 నుండి 30 వరకు రైళ్ల రద్దు కారణంగా సుమారు రూ. 102.96 కోట్ల మొత్తం వాపసు మంజూరు చేసినట్టు కేంద్ర మంత్రి వైష్ణవ్ చెప్పారు.