Friday, November 22, 2024

Train Accident | ఆ ప్రచారాలన్నీ అబద్ధం.. రైలు ప్రమాదంలో కమ్యూనల్​ యాంగిల్​ లేదు: సీపీఆర్​వో

ఒడిశాలోని బహనాగ రైల్వే స్టేషన్​ వద్ద జరిగిన మూడు రైళ్ల ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే.. ఈ దర్యాప్తు కొనసాగుతుండగానే అక్కడి మీడియా కొన్ని వార్తలను ప్రసారం చేయడం వివాదాస్పదంగా మారింది. అక్కడ పనిచేసే రైల్వే సిగ్నల్​ జూనియర్​ ఇంజినీర్​ (జేఈ), అతని కుటుంబం కనిపించకుండా పోయిందని, వారు మైనారిటీ వర్గానికి చెందిన వారనే వదంతులు వ్యాప్తి చెందాయి. ఈ రూమర్స్​ని తూర్పు రైల్వే చీఫ్​ పబ్లిక్​ రిలేషన్​ ఆఫీసర్​ (సీపీఆర్​వో) తప్పుపట్టారు. అదంతా తప్పుడు ప్రచారం అని స్పష్టం చేశారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండగానే రైలు ప్రమాదం ఘటనపై రూమర్స్​ మొదలయ్యాయి. ప్రమాదం జరిగిన (జూన్ 2న) రాత్రి నుండి సోరో రైల్వే సిగ్నల్ జూనియర్ ఇంజనీర్ (జెఇ), అతని కుటుంబం జాడ తెలియడం లేదని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పుకార్లు వ్యాపించాయి. ఈ యాక్సిడెంట్​లో కమ్యూనల్​ కోణం ఉందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే.. వీటిని కొట్టిపారేశారు తూర్పు రైల్వే చీఫ్​ పబ్లిక్​ రిలేషన్స్​ ఆఫీసర్​ (సీపీఆర్​వో) ఆదిత్య కుమార్​. కాగా, ఈ మూడు రైళ్ల ప్రమాదంలో 292 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. అలాంటి పుకార్లని నమ్మొద్దని, కేంద్ర దర్యాప్తు సంస్థకు తమ పూర్తి సహకారం ఉందని, తమ సిబ్బంది సహకరిస్తున్నారని తెలిపారు సీపీఆర్​వో.

బహనాగా సిబ్బంది పరారీలో ఉన్నారని, కొంతమంది కనిపించకుండా పోయారని కొన్ని మీడియా సంస్థలు వార్తలను ప్రచురించాయి. ఇది వాస్తవంగా తప్పు. రైలు దుర్ఘటన జరిగినప్పటి నుంచి తమ అధికారులెవరూ విధులకు గైర్హాజరు కాలేదు. మొత్తం సిబ్బంది విచారణలో భాగంగా ఉన్నారు. అవసరమైనప్పుడు CBI ముందు హాజరవుతారని CPRO ఆదిత్య కుమార్ చౌదరి స్పష్టం చేశారు.  

బహనాగా బజార్ రైల్వే స్టేషన్‌లోని రిలే గది, ఇతర పరికరాలను సాక్ష్యాలను భద్రపరచడానికి సీబీఐ సీల్ చేసిందని రైల్వే వర్గాలు తెలిపాయి. రైల్వే సిబ్బందిని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించింది. వారి మొబైల్​ ఫోన్లు, కాల్​ లిస్టులను పరిశీలించింది. డిజిటల్ లాగ్‌లను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

- Advertisement -

ఇక.. జూన్ 2వ తేదీన చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఆ తర్వాత కొద్దిసేపటికే హౌరాకు వెళ్లే యహస్వంత్‌పుర్​ సూపర్‌ఫాస్ట్ ఎదురుగా వస్తున్న కోరమాండల్‌ను ఢీకొట్టడంతో పలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘోర రైలు ప్రమాదంలో 292 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తూ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement