కరోనా మహమ్మారి కారణంగా చాలా ట్రైన్స్ రద్దు చేశారు. దాదాపు రెండు సంవత్సరాలుగా పలు రైళ్లు నడవలేదు. కరోనా తగ్గుముఖం పడుతుండటంతో రైల్వేశాఖ హోలీ కానుక ఇచ్చింది. మార్చి 1 నుండి, రైల్వేలో ఇప్పుడు అన్ని రైళ్లలో అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌ల కోసం మునుపటిలాగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఉత్తర భారతదేశం .. తూర్పు భారతదేశ ప్రజలకు ఉపయోగపడనుంది. ఈ నిర్ణయం ద్వారా హోలీ పండుగ సందర్భంగా వారి ఇళ్లకు వెళ్లే ప్రజలకు రైల్వే కానుకగా ఇచ్చింది. రైల్వే మంత్రిత్వ శాఖ తన ఆర్డర్‌లో, “అన్ని రైళ్లను మునుపటిలాగే ప్రారంభించామన్నారు.. ప్రయాణికులు మునుపటిలా రైలులో ప్రయాణించవచ్చు.ఈ నిర్ణయం ప్రయాణికులకు ఊరటనిస్తోంది. ఇకపై ప్రయాణికులు మునుపటిలాగా రైలులో సాధారణ టిక్కెట్లతో ప్రయాణించవచ్చు. అదే సమయంలో, ఇకపై జనరల్ టిక్కెట్లు తీసుకునేందుకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, సాధారణ టిక్కెట్లపై ప్రయాణించవచ్చని రైల్వే తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రైల్వే ద్వారా ప్రతిరోజు లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement