Tuesday, November 26, 2024

చైనీస్​ యాప్​ల మనీలోన్​ మోసం.. బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు

చైనీస్ లోన్ యాప్ మోసం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) నిబంధనల ప్రకారం బెంగళూరులోని ఐదు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇవ్వాల దాడులు చేపట్టింది. బెంగుళూరు సిటీలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు దీనిపై పలు కంప్లెయింట్స్​ వచ్చాయి. అయితే.. వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈడీ ఈ కేసును టేకాప్​ చేసింది.

దీంతో పలువురు వ్యక్తులపై నమోదైన 18 ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ సంస్థలచే నిర్వహిస్తున్న మొబైల్ యాప్‌ల ద్వారా చిన్న మొత్తాల లోన్‌లు చాలామంది పొందారని గుర్తించింది. కాగా, వారిని వేధింపులకు గురిచేస్తూ.. ఆర్థిక నేరాల దోపిడీకి పాల్పడుతున్న వారితో ప్రమేయం ఉందన్న కారణంగా ఈ సోదాలు జరిగాయి. ఈ విచారణలో పలు చైనా సంస్థలకు చెందిన వారితో సంబంధాలు ఉన్నట్టు ED విచారణలో వెల్లడయ్యింది. 

ఈ సంస్థల యొక్క కార్యనిర్వహణ విధానం భారతీయుల నకిలీ పత్రాలను ఉపయోగించి వారిని ఆ సంస్థలకు డమ్మీ డైరెక్టర్‌లుగా చేసి అక్రమంగా ఆదాయాన్ని పొందుతున్నట్టు తెలిసింది. పేమెంట్ గేట్‌వేలు, బ్యాంకులతో ఉన్న వివిధ వ్యాపారి IDలు.. ఖాతాల ద్వారా పలు సంస్థలు తమ అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు ఈడీ కనుగొంది. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నుండి వచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగా జరిపిన దర్యాప్తులో భాగంగానే ఈ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. Razorpay Pvt Ltd యొక్క ప్రాంగణాలు, ఈ సంస్థలకు సంబంధించిన బ్యాంకు కార్యాలయాలను తనిఖీ చేశారు.

- Advertisement -

ఆపరేషన్ సమయంలో సంస్థలు వివిధ వ్యాపారి IDలు, చెల్లింపు గేట్‌వేలు, బ్యాంకులతో నిర్వహించబడిన ఖాతాల ద్వారా నేర ఆదాయాన్ని పొందుతున్నాయని.. KYC పత్రాలలో నకిలీ చిరునామాలను దాఖలు చేసినట్టు తాము గుర్తించామని ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement