హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఓయూలో నిర్వహించతలపెట్టిన సభకు అనుమతిని ఇప్పించాలంటూ ఓయూ జేఏసీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్నత విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి, ఓయూ వైస్ ఛాన్స్లర్, ఓయూ రిజిస్ట్రార్లని పేర్కొన్నారు. విద్యార్థులు నిరుద్యోగులతో రాహుల్ గాంధీ ఇంటరాక్ట్ అవుతారని పిటిషన్లో తెలిపారు.
ఈ మీటింగ్లో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు ఉండబోవని, శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశమే లేదని వివరించారు. అధికార పార్టీ వత్తిడి వల్లే సభకు అనుమతి ఇవ్వడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఠాగూర్ ఆడిటోరియంలో సభకు అనుమతించేలా వీసీని ఆదేశించాలని కోర్టును కోరారు. లంచ్ మోషన్ పిటిషన్పై సోమవారం వాదనలు జరుగనున్నాయి.