Friday, November 22, 2024

నీ వెనుక నేనున్నా…దూసుకుపో రేవంత్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ముఖ్య ప్రతినిధి: పాదయాత్రతో దూసుకువెళ్తున్న పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి ఇంటాబయట మద్దతు పెరుగు తోంది. పాదయాత్రలో ప్రజాస్పందన కనిపి స్తుండడంతో.. పార్టీలో కూడా.. ఆమోదం పెరిగింది. సీఎం అభ్యర్థి మీరే.. గట్టిగా పోరా డండి. 80శాతం టికెట్లు- మీరు సూచించిన వారికే దక్కుతాయని రాహుల్‌గాంధీ ఇటీవల రేవంత్‌ను భుజం తట్టి ప్రోత్సహించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రేవంత్‌ కోసం కర్ణాటక నేత డీకే శివకుమార్‌ బలమైన లాబీ యింగ్‌ చేస్తుండగా, ఢిల్లీ నుండి ఫుల్‌ సపోర్ట్‌ లభిస్తోంది. పాదయాత్రకు తెలంగాణ వ్యాప్తంగా లభిస్తున్న మద్దతు నేపథ్యంలో.. రాహుల్‌ రేవంత్‌తో ప్రత్యేకంగా మాట్లాడి అభినందించినట్లు- తెలుస్తోంది. అంతర్గత సమస్యలు నేను చూసుకుంటా.. దూసుకుపో అని చెప్పినట్లు- సమాచారం. ఎన్నికల సమ యంలో ప్రచారానికి వస్తా.. అవసరం మేరకు ప్రియాంక వస్తారని, ఖర్గేతో టచ్‌లో ఉండాలని రేవంత్‌కు రాహుల్‌ సూచించినట్లు- తెలుస్తోంది. రాయ్‌పూర్‌ సమావేశంలో తెలంగాణ వ్యవహారాలపై అంతర్గతంగా ప్రత్యేక చర్చ జరిగినట్లు- తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు- తిరిగి జరగకుండా.. 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ బలమైన వ్యూహంతో ముందుకు వెళుతోంది.

ప్రక్షాళన పక్కా..
తెలంగాణలో అంతర్గత ప్రక్షాళనకు కేంద్ర నాయకత్వం సిద్ధమైంది. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బలంగా పోరాడాలని కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయించింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న సానుకూలతను అంతర్గత సమస్యలు అధిగమించి ప్రజామద్దతుతో అధికారంలోకి తీసుకురావాలని, రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే అది సాధ్యమని ఏఐసీసీ భావిస్తోంది. నాడు వైఎస్‌ఆర్‌ తరహాలో రేవంత్‌రెడ్డికి కూడా.. జనాకర్షక సమ్మోహన శక్తి ఉందని నాయకత్వం భావిస్తోంది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ- పదవికి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ -పడుతుండగా, సీనియర్లకు సమర్ధత అవకాశాల ఆధారంగా జాతీయ కమిటీల్లోకి తీసుకోవాలని నాయకత్వం డిసైడింది. తెలంగాణలో పార్టీ సమన్వయకర్తగా జానారెడ్డికి బాధ్యతలు అప్పగించాలని డిసైడైంది. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని ఏఐసీసీలోకి తీసుకోనుండగా, భట్టికి స్టార్‌ క్యాంపెయినర్‌ పదవి దక్కనున్నట్లు- తెలుస్తోంది. సీఎల్పీ నేతగా శ్రీధర్‌బాబు, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సీతక్కలను నియమించాలని, బలమైన ప్రక్షాళనతో కాంగ్రెస్‌ జోరు పెంచాలని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్త సునిల్‌ కనుగోలు కూడా.. ఎప్పటికప్పుడు పార్టీ గ్రాఫ్‌, అంతర్గత దిద్దుబాట్లపై నివేదికలు అందిస్తుండగా, కాంగ్రెస్‌ క్రమేపీ పుంజుకుంటు-న్నదని, రేవంత్‌ నాయకత్వం పటిష్టమవుతున్నదని.. ప్రజల్లో ఆశలు పెరుగుతున్నాయని నాయకత్వం అంచనా వేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాలను ఏఐసీసీ అధినేత ఖర్గేతో పాటు- ప్రియాంకగాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement