బెంగుళూరు – మా వెంట నిజం ఉంది.. మా వెనుక పేద ప్రజలు ఉన్నారు. కానీ బీజేపీ దగ్గర డబ్బు ఉంది.. పోలీసులు ఉన్నారు.. ప్రతిదీ వారి దగ్గర ఉంది. కానీ కర్ణాటక ప్రజలు వారిని ఓడగొట్టారు’’ అని రాహుల్ అన్నారు. విద్వేషంపై ప్రేమ గెలిచింది అంటూ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలకు మరోసారి రాహుల్ కృతఙ్ఞతలు తెలిపారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, మంత్రులుగా 8 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, . ‘‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలిచిందంటూ వివిధ విశ్లేషణలు జరిగాయి. నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. పేదలు, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులకు బాసటగా నిలవడం వల్లే కాంగ్రెస్ గెలుపు సాకారమైంది’’ అని తెలిపారు. ‘‘మేం 5 వాగ్దానాలు చేశాం.. 2 గంటల్లో అమలు చేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలన అందిస్తుందని, ఎన్నికలలో తమ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని చెప్పారు. . ‘‘మేము ఎప్పుడూ తప్పుడు హామీలు ఇవ్వము. ఏది చెప్పామో అదే చేస్తాం. మరో ఒకటి, రెండు గంటల్లోనే కేబినెట్ తొలి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలోనే ప్రజలకు ఇచ్చిన 5 హామీలకు చట్టబద్ధత కల్పిస్తాం’’ అని ప్రకటించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement