Monday, November 18, 2024

ఈ నెల 31న రాహుల్ గాంధీ అమెరికా ప‌ర్య‌ట‌న‌..

న్యూఢిల్లీ – కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మే 31న అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. పది రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. జూన్ 4న న్యూయార్క్‌లోని మేడిసన్ స్వ్కేర్ గార్డెన్‌లో జరిగే ర్యాలీలో సుమారు అయిదు వేల మంది ఎన్ఆర్ఐలు పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ తన పర్యటనలో వాషింగ్టన్, కాలిఫోర్నియాలో జరిగే ప్యానల్ డిస్కషన్‌లో పాల్గొంటారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించనున్నారు. అలాగే పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలను కలుసుకుంటారు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు’ అంటూ దేశ ప్రతిష్టను దిగజార్చే వ్యాఖ్యలు చేశారని అన్నారు. కాగా, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జూన్ 22న అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్‌ వైట్‌హౌస్‌లో ఇచ్చే విందు కార్యక్రమంలో కూడా పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనకు కొన్ని రోజుల ముందు రాహుల్ అమెరికాకు వెళ్తుండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement