Thursday, November 21, 2024

Spl Story: 60వ రోజుకు చేరిన రాహుల్​ పాదయాత్ర.. రేపు మహారాష్ట్రలోకి భారత్​ జోడో!

కాంగ్రెస్​ పార్టీ ముఖ్య నేత, ఎంపీ రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారి నుంచి చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవ్వాల్టికి (ఆదివారం) 60వ రోజుకు చేరుకుంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వ్యాప్తి చేస్తున్న ద్వేషం.. హింసను వ్యతిరేకిస్తూ.. ప్రజలను ఏకం చేయడానికి రాహుల్​ గాంధీ చేస్తున్న పాదయాత్ర శ్రీనగర్‌లో ముగియనుంది. 3,750 కిలొమీటర్లు సాగి 12 రాష్ట్రాల మీదుగా రాహుల్ యాత్ర కొనసాగనుంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లలో భారత్​ జోడో యాత్ర ముగిసింది. ఇక.. రేపటితో (సోమవారం) తెలంగాణ నుంచి మహారాష్ట్రలో భారత్​ జోడో యాత్ర ప్రవేశించనుంది. ఈ యాత్ర అక్టోబర్ 23న కర్నాటక నుంచి తెలంగాణలోకి ప్రవేశించింది. రాష్ట్రంలో సాగిన యాత్రకు పండుగల నేపథ్యంలో 4 రోజుల విరామం దొరికింది. ఇక.. తెలంగాణలోని 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తం 375 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది.

ఇది కూడా చదవండి: Breaking: హవాలా మీడియేటర్లుగా బీజేపీ లీడర్లు.. కోట్లాది డబ్బుని మునుగోడులో పంచారు: కేటీఆర్​

ఆదివారం ఉదయం మెదక్ జిల్లా అల్లాదుర్గంలో రాహుల్​ గాంధీ 60వ రోజు భారత్​ జోడో పాదయాత్ర ప్రారంభించారు. చింతల్ లక్ష్మాపూర్‌లో మధ్యహ్న బ్రేక్​కి ముందు ఆయన టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర రాష్ట్ర నాయకులతో కలిసి అల్లాదుర్గంలోని వివిధ ప్రాంతాల మీదుగా నడిచారు. ఈరోజు పాదయాత్రలో రాహుల్ పలు వర్గాల ప్రజలతో ముచ్చటించారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడిన వారి వైపు చేతులు ఊపుతూ ఉత్సాహంగా ముందుకు సాగారు. తనతో సెల్ఫీలు దిగాలని కొందరు యువకులు చేసిన రిక్వెస్ట్​ని కాదనకుండా వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. అట్లనే వివిధ సంఘాల ప్రతినిధులతో కాసేపు సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

ఇది కూడా చదవండి: ఆడపిల్లకి జన్మనిచ్చిన ఆలియా.. పండగ చేసుకుంటోన్న రాఖీ సావంత్

ఇక.. సాయంత్రం నారాయణఖేడ్‌లోని నిజాం అండర్‌పాస్‌ వద్ద పాదయాత్ర తిరిగి ప్రారంభమై మహదేవపల్లిలో ముగియనుంది. కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో రాహుల్‌ రాత్రి బస చేయనున్నట్టు తెలుస్తోంది. భారత్ జోడో యాత్ర సోమవారం మహారాష్ట్రలో ప్రవేశించనుంది. ఇవ్వాల ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త భరత్ భూషణ్ పాదయాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. రాహుల్​కి మద్దతు ఇచ్చారు.

రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్ కూడా కలిసి నడిచారు. కాగా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) నాయకుడు, మంద కృష్ణ మాదిగ కూడా ఇవ్వాల పాదయాత్రలో రాహుల్ గాంధీని కలుసుకున్నారు. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ కోసం తమ సంస్థ దీర్ఘకాలంగా పోరాటం చేస్తోందని, పెండింగ్‌లో ఉన్న డిమాండ్ గురించి రాహుల్​కి మందకృష్ణ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement