ఉద్యోగాల సమస్యపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం కేంద్రంపై విరుచుకుపడ్డారు. విద్యార్థులు ‘సత్యాగ్రహం’ చేయాలని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారో ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.. అయితే “ఒక అహంకారి ఇప్పటికీ కళ్లు మూసుకుని కూర్చున్నాడు” అని ఫైర్ అయ్యారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై, నిరుద్యోగాన్ని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు.
దేశంలో 3.03 కోట్ల మంది యువతకు పనిలేదని మీడియాలో వచ్చిన కథనంపై ప్రభుత్వంపై ఇవ్వాల రాహుల్ దాడి చేశారు. మీడియా నివేదికను ట్యాగ్ చేస్తూ.. “విద్యార్థులు సత్యాగ్రహం చేయాలని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి” అని ట్వీట్ చేశారు.