Monday, November 25, 2024

ఒక అహంకారితోనే దేశంలో నిరుద్యోగం..  మోడీపై  రాహుల్ గాంధీ అటాక్​

ఉద్యోగాల సమస్యపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం కేంద్రంపై విరుచుకుపడ్డారు. విద్యార్థులు ‘సత్యాగ్రహం’ చేయాలని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారో ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.. అయితే “ఒక అహంకారి ఇప్పటికీ కళ్లు మూసుకుని కూర్చున్నాడు” అని ఫైర్​ అయ్యారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై,  నిరుద్యోగాన్ని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని రాహుల్​ గాంధీ విమర్శిస్తున్నారు.

దేశంలో 3.03 కోట్ల మంది యువతకు పనిలేదని మీడియాలో వచ్చిన కథనంపై ప్రభుత్వంపై ఇవ్వాల రాహుల్​ దాడి చేశారు. మీడియా నివేదికను ట్యాగ్ చేస్తూ.. “విద్యార్థులు సత్యాగ్రహం చేయాలని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి” అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement