Tuesday, November 19, 2024

ప్రధాని మోదీకి రాహుల్ లేఖ..

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. దేశంలో అవసరమున్న ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని ఆయన లేఖలో మోదీని కోరారు. అంతేకాదు మన దేశం నుంచి ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్ ఎగుమతిని ఆపాలపి కోరారు. కోవిడ్ విజృంభణ ఇలాగే సాగితే… దేశం ఆర్థికంగా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని లేఖలో హెచ్చరించారు. మూడు నెలల్లో కేవలం ఒకశాతం కంటే తక్కువ మందికే టీకాలు అందాయని రాహుల్ విమర్శించారు. 75 శాతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు చేరుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుందని, ఇలాగే కొనసాగితే మాత్రం దేశం ఆర్థికంగా చాలా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతోందని, ఈ సమయంలో ఇతర దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్‌ను ఎగుమతి చేయడంపై రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement