కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఈ నెల 28న తమిళనాడు సీఎం స్టాలిన్ ఆటో బయోగ్రఫీ ఉంగలిన్ ఒరువన్ మొదటిభాగాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేరళ సీఎం పినరయి విజయన్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా హాజరుకానున్నారట. ఎస్.దురైమురుగన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. తమిళ నటుడు సత్యరాజ్ ఈ పుస్తకాన్ని పరిచయం చేయనున్నారు. ఇక స్టాలిన్ తన పుస్తకంలో.. తన బాల్యం, పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయ ప్రవేశం ఎలా చేశారనేది తెలియజేయనున్నారట..
అలాగే.. పెరియార్, అన్నాదురై, తండ్రి కలైంజర్ కరుణానిధి, సి.ఎన్ వంటి గొప్ప నాయకుల నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్నట్లు ఆ పుస్తకంలో చెప్పారు. ఈ పుస్తకంలో తమిళనాడు ముఖ్యమంత్రి పెరియార్, అన్నాదురై, కరుణానిధి సహా ద్రవిడ ఉద్యమ వ్యవస్థాపక నాయకులు చేపట్టిన పోరాటాలను కూడా ప్రస్తావించారు. ప్రజల సమస్యల కోసం సుదీర్ఘ పోరాటాల తర్వాత డీఎంకే ఎదుగుదల గురించి కూడా ఆయన పుస్తకంలో తెలిపారట.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..