Friday, November 22, 2024

రాహుల్ గాంధీ సెక్యూరిటీ విష‌యంపై స్పందించిన.. సీఆర్ పీఎఫ్

సెక్యూరిటీ విష‌యంలో సిబ్బంది నిర్ల‌క్ష్యంలేద‌ని.. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ భ‌ద్ర‌తా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను త‌ర‌చూ ఉల్లంఘాస్తార‌ని సీఆర్ పీ ఎఫ్ తెలిపింది. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ భద్రతపై ఆందోళన వ్యక్తంచేస్తూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు లేఖ రాసిన విషయం తెలిసిందే.. దీనిపై తాజాగా సీఆర్ పీఎఫ్ గురువారం స్పందించింది. 2020 నుంచి ఇప్పటి వరకు 113 సార్లు భద్రతా మార్గదర్శకాలను రాహుల్ అతిక్రమించారని, ఈ విషయాన్ని ఆయనకు కూడా తెలియజేసినట్లు వివరించింది.

ఈమేరకు ఈ లేఖపై సీఆర్ పీఎఫ్ స్పందించి, సెక్యూరిటీ వివరాలతో వివరణ ఇచ్చింది. జోడో యాత్ర ఢిల్లీలో ప్రవేశించిన తర్వాత జనం రద్దీ పెరిగిందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. జనం రాహుల్ గాంధీకి అతి సమీపంలోకి రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి రక్షణ కల్పించాల్సి వచ్చిందని వెల్లడించింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ భద్రతపై ఆందోళన వ్యక్తంచేస్తూ.. రాహుల్ కు సెక్యూరిటీ మరింత పెంచాలని హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement