Wednesday, November 20, 2024

Politcs: ఇవ్వాల యూపీ యూత్ మేనిఫెస్టో ప్రకటించనున్న రాహుల్, ప్రియాంక..

కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ యువత మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇరువురు నేతలు ప్రత్యేక విలేకరుల సమావేశంలో ప్రసంగించనున్నారు. యువత, మహిళలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్న పార్టీ ఉత్తరప్రదేశ్‌లో మహిళలకు 40 శాతం టిక్కెట్లను రిజర్వ్ చేస్తానని ప్రకటించింది. ఇదిలా ఉండగా, వచ్చే నెలలో జరగనున్న యూపీ ఎన్నికల్లో యాదవ్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న మెయిన్‌పురిలోని కర్హాల్ స్థానం నుంచి సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్ పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. 2002 , 2007 మధ్య ఐదు సంవత్సరాలు మినహా 1993 నుండి ప్రతి ఎన్నికలలో కర్హాల్ స్థానాన్ని సమాజ్ వాదీ పార్టీ గెలుచుకుంటోంది. అది వారికి కంచుకోట అనే చెప్పవచ్చు.

వచ్చే నెలలో జరగనున్న గోవా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల జాబితాలో మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్కు చోటు దక్కలేదు. మనోహర్ పారికర్‌కు చెందిన పనాజీ సీటు కావాలని కోరిన ఆయన కుమారుడిని కాదని, అటానాసియో “బాబుష్” మాన్‌సెరేట్‌కు ఇవ్వాలని బీజేపీ హై కమాండ్ నిర్ణయించింది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై గోరఖ్‌పూర్‌లో పోటీ చేస్తానని ప్రకటించిన మొదటి అభ్యర్థి భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్. రాబోయే ఎన్నికల్లో యోగిపై పోటీ చేస్తానని ఈ దళిత నాయకుడు గతంలోనే సవాల్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అయితే ఆయన ప్రధాన ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కాగా, చంద్రశేఖర్ ఆజాద్‌కి ఇదే తొలి ఎన్నిక కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ఫిబ్రవరి 10 నుండి ఏడు దశల్లో ఓటింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement