Thursday, November 21, 2024

Breaking: రాహుల్ గాంధీకి సూరత్ కోర్టులో బెయిల్

మోడీపై పరువునష్టం దావా కేసులో రెండేళ్లు శిక్ష పడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో రాహుల్ గాంధీ నేరుగా కోర్టులో హాజరయ్యారు. తనకు పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతూ సెషన్ కోర్టు న్యాయమూర్తిని అభ్యర్థించారు. అలాగే బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రెండింటినీ విచారించిన కోర్టు రాహుల్ గాంధీకి తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేసింది. అదేవిధంగా ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 13వతేదీకి వాయిదా వేసింది. కాగా… పరువునష్టం కేసులో తనకు విధించిన రెండేళ్ల జైలుశిక్షను రద్దు చేయాలని కోరుతూ ఇదే కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను కూడా ఏప్రిల్ 13వతేదీననే జరుపుతామని కోర్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement