Tuesday, November 26, 2024

వ్యాక్సిన్ కొరత చాలా సీరియస్ సమస్య.. రాహుల్ గాంధీ ఫైర్

దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత ఏర్పడడం చాలా తీవ్రమైన విషయమని, అది ఉత్సవం కాదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ నెల 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవం నిర్వహిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. టీకాలు మనకే సరిపోనప్పుడు విదేశాలకు ఎగుమతి చేయడమేంటని ప్రశ్నించారు.  చాలా సెంటర్లలో కోవిడ్ టీకాలు లేవని, వాటిని మూసేస్తున్నారని రాహుల్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దేశంలో కరోనా తీవ్రత పెరిగింది. వ్యాక్సిన్ల కొరత చాలా సీరియస్ సమస్య. అది ఉత్సవం కాదు. దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఇతర దేశాలకు వ్యాక్సిన్లు ఎగుమతి చేయడం సరైనదేనా? ఎలాంటి సంకోచం లేకుండా కేంద్రం అన్ని రాష్ట్రాలకూ కోవిడ్ టీకాలను సరైన మోతాదులో పంపిణీ చేయాలి. అందరమూ కలిసి కరోనాపై పోరాడదాం. అని రాహుల్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement