నయారాయ్‌పూర్: అదానీ అంశాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్‌నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుప డ్డారు. పార్లమెంట్‌లో అదానీకి మద్దతుగా నిలిచిన బీజేపీపై ధ్వజమెత్తా రు. నిజం బయటకు వచ్చే దాకా అదానీపై కాంగ్రెస్ ప్రశ్నలు సంధిస్తూనే ఉంటుందని స్పష్టంచేశా రు. గౌతమ్ అదానీ, మోడీ ఇద్దరూ ఒక్కటేనని ఆరోపించారు. బీజేపీ-ఆరెస్సెస్ ఆదానీని ఎందుకు రక్షిస్తున్నాయని ప్రశ్నించారు. అధికారం కోసం వారు (బీజేపీ -ఆర్‌ఎస్‌ఎస్) ఏమైనా చేస్తారని, ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటా రని, ఎవరి ముందైనా తలవంచుతారని ఎద్దేవా చేశారు. ప్రపంచ కుబేరుల జాబితాలో 609వ స్థానంలో ఉన్న అదానీ అనతి కాలంలోనే నంబర్-2 స్థానానికి ఎలా వచ్చారు? ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిరాగానే, అదానీకి కాంట్రాక్టులు ఎలా వసా ్తయి? శ్రీలంక కూడా చెప్పిం ది.. మోడీ ఒత్తిళ్లతోనే అదానీకి కాంట్రాక్టులు ఇచ్చామని అంగీకరిం చింది. ఇది వాస్తవం కాదా? అదానీ, మోడీ బంధం ఏమిటనేది ఇప్పటికైనా బయట పెట్టాలి అని రాహుల్ నిలదీశారు. కేంద్ర మంత్రులు, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు పార్లమెంట్‌లో అదానీని వెనకేసు కొచ్చారు. అదానీ గురించి ఎవరు ప్రశ్నించినా వారిని దేశద్రోహులని ముద్ర వేస్తారు.. బిలియనీర్లు దేశ భక్తులవుతు న్నారు అంటూ మండిపడ్డారు. వెయ్యిసార్లయినా ప్రశ్నిస్తూనే ఉంటాం అదానీకి దేశ సంపదంతా దోచిపెట్టి, పేదలకు, దేశానికి వ్యతిరేకంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. ప్రధానికి అదానీకి సంబంధం ఏమిటని మేము పార్లమెంట్‌లో ప్రశ్నించినప్పుడు మా ప్రంసగా న్ని రికార్డుల నుంచి తొలగించారు. ఇలాంటి చర్యలతో మేము వెన క్కి తగ్గం. నిజం బయటకు వచ్చేవ రకు ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటాం. వేలసార్లు ప్రశ్నిస్తాం. అదానీ కంపెనీ లు దేశం లోని మౌ లిక సంపదనంతా దోచేస్తోందని నేను చెప్పదలచుకు న్నాను. నాడు ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రో ద్యమం జరిగింది. అప్పట్లో వారూ ఓడరేవులు మొదలైన సంపదను దోచుకున్నారు. మళ్లిd ఇప్పుడు చరిత్ర పునరావృతం అవుతోంది. ఇది దేశానికి నష్టం కలిగించేది అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ నొక్కిచెప్పారు. భారత్ జోడోయాత్ర ద్వారా చేపట్టిన తపస్సును ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ కొత్త ప్రణాళికను రూపొం దించాలని, దేశం మొత్తం అందులో భాగమవుతుందని రాహుల్ ఆశాభావం వ్యక్తంచేశారు.
పేదల ఆకలి – కన్నీళ్లు దగ్గరగా చూశా..
భారత్ జోడో యత్రలో తనకు ఎదురైన అనుభవాలను, యాత్రకు లభించిన విశేష ప్రజాదరణను గుర్తుచేసుకు న్నారు. ”నా దేశం కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ నడిచాను. వేలాది మంది నాతో నూ, పార్టీతోనూ మమేకమ య్యారు. రైతుల సమస్య లన్నింటినీ విని, వారి బాధలేమిటో ఆక లింపు చేసుకున్నాను. మహళలు, యు వకు ల ఆవేదనను అర్ధం చేసుకున్నాను. లక్షలాది మంది యాత్రలో మాతో కలిసి నడిచారు. మంచు, వర్షాలు, ఎండ లను కూడా లెక్కచేయకుండా ఎంతో సాహ సంగా మాతో కలిసి ప్రయాణిం చారు. భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ యువ కుల్లో త్రివర్ణ పతాకం పట్ల ప్రేమను పాదుకొలి పాం” అని చెప్పారు. ఆరోగ్యం బాగోలేనప్పు డు సహజంగానే తాను అస హనంగా ఉంటానని, కాలినొప్పితో ఇలాంటి అసహనానికి గురై నప్పటికీ భారత్ జోడో యాత్ర ప్రారంభించగానే ఒక్కసారిగా అదంతా మ టుమాయమైందని తెలిపారు. భరతమాత నుంచి అందిన సందే శంతో తనకు ఎంతో బలం చేకూరిందని అని రా#హుల్ అన్నారు.
మతం పేరుతో వివక్ష
భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వం విద్వేష ప్రచారం ద్వారా దేశాన్ని ధ్వంసం చేస్తోంది.భారత్ జోడో యాత్ర లో చివరిగా జమ్ము- కాశ్మీర్‌లో తాను అడుగిడినప్పుడు ముఖ్యం గా యువత ఎంతో ఆదరంగా ముందుకు వచ్చి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాశ్మీర్‌లో మతం పేరుతో యువత వివక్షకు గురవుతోంది అని రాహుల్ ఆరోపించారు.
బలవంతులకు తలొగ్గడమే సావర్కార్ ఐటియాలజీ..
బలమైన ఆర్థిక వ్యవస్థ అయిన చైనాతో ఎలా ఫైట్ చేస్తామని ఇటీవ ల ఒక ఇంటర్వ్యూలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చేసిన వ్యాఖ్యలను నేరుగా రా#హుల్ తప్పుపట్టారు. భారత ఆర్మీ శక్తి సామర్థ్యాలను శంకిస్తూ మాట్లాడిన ఆ మంత్రి పేరును నేను ప్రస్తావించదలచు కోలేదు. ఇది నిశ్చయం గా బలవంతులకు తలవంచడమనే సావర్కర్, ఆర్‌ఎస్‌ఎస్ ఐడియాలజీనే. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాతో ఎలా పోరాటగలమని అనడం దేశభక్తి ఎంతమాత్రం కాదు, పిరికితనం అవుతుంది.బ్రిటీష్ వారు మనల్ని పాలించినప్పుడు, వారి ఆర్థిక వ్యవస్థ మనకంటే చిన్నదా? అని ప్రశ్నించారు. అంటే మీరు మీకంటే శక్తివంతుల ముందు తలవంచుతారన్న మాట అంటూ సూటిగా ప్రశ్నించారు.
నాకు52 ఏళ్లు ఇప్పటికీ ఇళ్లు లేదు..
అధికారిక నివాసాన్ని ఖాళీ చేయమని వాళ్లు (కేంద్రం) చెప్పిన ప్పుడు ఎంత క్లిష్ట పరిస్థితిని తమ కుటుంబ ఎదుర్కో వాల్సి వచ్చిందో తనకు బాగా గుర్తుందని రాహుల్ అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు ప్లీనరీలో పాల్గొన్న సోనియా గాంధీ సహా కాంగ్రెస్ కార్యకర్తలు చిరునవ్వులు చిందిస్తూ రాహుల్‌ను ఉత్సాహ పరచడం కనిపించింది. 1997 ఎన్నికల తర్వాత జరిగిన ఒక సంఘటనను గుర్తుచే స్తూ.. ఒక రోజు మా అమ్మ ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నా మని చెప్పే వరకు అది మా ఇల్లు అనే భావించాను. ఇంట్లో విచిత్రమైన పరిస్థితి ఉంది. నేను మా అమ్మ వద్దకు వెళ్లి అడిగాను. ఏం జరిగిందని. మనం ఇల్లు ఖాళీ చేస్తున్నాం అని చెప్పింది. ఇది మన ఇల్లు కాదని, ప్రభుత్వానిదని చెప్పింది. ఈ విషయం తెలిసి నేను ఒక్కసారిగా కంగారు పడ్డాను. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్లాలి అని అడిగాను. ఏమో నాకూ తెలీదు అని అమ్మ బదులిచ్చింది అని రాహుల్ గుర్తుచేశారు. నాకు ఇప్పుడు 52ఏళ్లు. ఇప్పటికీ నాకు ఇల్లు లేదు. అలహాబాద్‌లో ఉన్న ఇల్లు మాది కాదు. నేను 12వ నంబర్ తుగ్లక్ రోడ్‌లో ఉంటున్నాను. అది కూడా నా ఇల్లుకాదు. కాబట్టి నేను భారత్ జోడో యాత్ర చేపట్టినప్పుడు, నాబాధ్యత ఏమిటని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అపుడు నా మదిలో ఒక ఆలోచన వచ్చింది. నన్ను కలవడానికి వచ్చిన వ్యక్తులకు యాత్రా ప్రదేశమే రాబోయే నాలుగు నెలలు నా ఇల్లు అని చెప్పాను. యాత్ర మన ఇల్లు. ధనవంతులు, పేదలు అందరికీ ఈ ఇంటి తలుపులు తెరిచి ఉంటాయని చెప్పాను. యాత్రలోకి వచ్చిన వారంతా తమ సొంత ఇంటికి వచ్చినట్లు భావించారు. వెళ్లేటప్పుడు కూడా ఇంటిని వీడు తున్నట్లు బాధపడ్డారు అని రాహుల్ వివరించారు. యాత్ర ముం దుకు సాగుతున్న కొద్దీ స్వరూపం మారిపోయింది. ప్రజలు నాతో రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఆపై యాత్ర కాశ్మీర్ చేరుకు న్నప్పుడు నేను నా ఇంటికి చేరుకున్నాను అనే భావన కలిగింది.