తమిళనాడులో అసెంబ్లీ ఎన్నిక ప్రచారంతో వేడెక్కాయి. ఈ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటులు కూడా పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి పార్టీలపై దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రచారం సందర్భంగా నాయకులు హద్దులు మీరుతున్నారు. వ్యక్తిగత అంశాల ప్రస్తావన తీసుకొస్తున్నారు. తాజా ప్రముఖ తమిళ సినీ నటుడు, బీజేపీ నేత రాధారవి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్, సినీ నటి నయనతార గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నయనతారతో ఉదయనిధి స్టాలిన్ సహజీవనం చేస్తున్నాడని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన్నందుకే తనను డీఎంకే నుంచి బహిష్కరించారని చెప్పారు.
ఇక కమలహాసన్ ను కూడా రాధారవి వదిలిపెట్టలేదు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు గుప్పించారు. ముగ్గురు భార్యలను కాపాడుకోలేకపోయిన కమల్… రాష్ట్రాన్ని ఏం కాపాడతారని ఆయన విమర్శించారు. కాగా, రాధారవి ఎప్పుడూ ఏదోఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ పతాక శీర్షికల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే ఆయన చేసిన పలు వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాజాగా చేసిన కామెంట్లతో మరోసారి వార్తలో నిలిచారు. మరోవైపు రాధారవి వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. డీఎంకే శ్రేణులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.