అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సర్కార్ సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. శిశువైద్యురాలు, ట్రాన్స్‌జెండర్ మహిళ రాచెల్ లెవిన్‌ను బైడెన్ ఆరోగ్య సహాయ కార్యదర్శిగా ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. పెన్సిల్వేనియా ఆరోగ్య శాఖ చీఫ్ అయిన రాచెల్‌ను ఈ ఏడాది జనవరిలో బైడెన్ ఈ కీలక పదవికి నామినేట్ చేశారు. రాచెల్ నామినేషన్ నిర్ధారించేందుకు సెనేట్‌లో ఓటింగ్ నిర్వహించారు. దీంతో రాచెల్‌ను 52-48 ఓట్ల తేడాతో సెనేట్ ఆమోదం తెలిపింది. ఇక తనకు దక్కిన ఈ కీలక పదవి పట్ల ఆనందం వ్యక్తం చేసిన రాచెల్.. 5.45 లక్షల మంది అమెరికన్లను పొట్టనబెట్టుకున్న మహమ్మారిపై పోరునే తన తొలి లక్ష్యంగా పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement