యూకేలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని వెయ్యి స్క్రీన్స్ పై రిలీజ్ చేయనున్నారు. కాగా వాటిల్లో లండన్ లోని ఓడియన్ బీఫ్ ఐ ఐమ్యాక్స్ కూడా ఒకటి. అయితే ఈ ఐమ్యాక్స్ యూకేలోనే అతి పెద్ద స్ర్ర్కీన్. ఈ తెరపై ‘ఆర్ ఆర్ ఆర్’ను చూడటం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఒక తెలుగు సినిమా ఈ తెరను ఆక్రమించడం గౌరవమే కాదు .. గర్వకారణం కూడా. ఇది చారిత్రక నేపథ్యంలోని కథ కావడం .. దాదాపు ఓకే ఇమేజ్ ఉన్న హీరోలకు సంబంధించిన మల్టీ స్టారర్ కావడం .. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ గల ఆర్టిస్టులు .. సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగం కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. రిలీజ్ తరువాత ఈ సినిమా రికార్డుల పరంపర మొదలవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలని పోషిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement