Friday, November 22, 2024

Quick Respond – ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ,వాయుసేన‌, వైద్యుల సేవ‌ల‌కు ప్ర‌శంస‌లు….

కోల్‌కతా: ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోవడం, వేయి మందికి పైగా గాయపడటం తీవ్ర విషాదాన్ని నింపింది. దేశ రైల్వే చరిత్రలోనే అతిప్ర‌మాదంగా నిలిచింది.. కాగా,శుక్రవారం రాత్రి 6.55కి ఈ ప్రమాదం జరగగా..వెంటనే స్థానికులు స్పందించారు.. బోగీలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తమ వంతు సాయం చేపట్టారు. ఘటన తెలిసిన విపత్తు నిర్వహణ సిబ్బందితోపాటు వైద్య బృందాలు, అంబులెన్సులు సహా ఇతర విభాగాలు వేగంగా స్పందించాయి. భారత సైన్యం , వాయుసేన బృందాలు కూడా కేవలం నిమిషాల వ్య‌వ‌ధిలోనే రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు రంగంలోకి దిగాయి. రాత్రి 8.30 నాటికి బాలేశ్వర్‌లోని తొలి బృందం అక్కడకు చేరుకుంది. అనంతరం కటక్‌, కోల్‌కతా నుంచి మరిన్ని బృందాలు వచ్చాయి. మొత్తం 300 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. తొమ్మిది బృందాలుగా ఏర్పడి క్షతగాత్రులను బయటకు తీసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించి వారిని తొలుత కాపాడారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌ జాగిలాలు, మహిళా సిబ్బందితోపాటు వైద్య బృందాలు ఇందులో పాలుపంచుకున్నాయి. భారీ క్రేన్లు, గ్యాస్‌, ప్లాస్మా కట్టింగ్‌ యంత్రాలతో రైలు కోచ్‌లను విడదీస్తూ అందులో ఇరుక్కుపోయిన వారిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బయటకు తీసేందుకు శ్రమించాయి. అనంతరం లిఫ్టింగ్‌ ప్యాడ్‌లతో వారిని సమీప ప్రాంతానికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స నిర్వహించాయి. ఘటన తీవ్రమైనది కావడంతో ఇతర విభాగాలూ వేగంగా స్పందించాయి. 200 అంబులెన్సులు, 50 బస్సులు ఘటనా స్థలానికి చేరుకోవడంతోపాటు 45 మొబైల్‌ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 1200 మంది రెస్య్కూ సిబ్బంది సాయంతో గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. కటక్‌నుంచి 25 వైద్య బృందాలతోపాటు మరో 50 మంది వైద్యులు ఇందులో పాల్గొన్నారు. వీరికితోడు ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ నిపుణులు కూడా సహాయక చర్యల్లో భాగమయ్యారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో భారత వాయుసేన కూడా పాలుపంచుకుంది. తీవ్ర గాయాలపాలైన వారికోసం వైద్య బృందాలతో కూడిన రెండు ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్ల (ఎంఐ 17)ను రంగంలోకి దించింది. భారత సైన్యం ఆరోగ్య సిబ్బంది కూడా అంబులెన్సులు, ఇతర సామగ్రితో గాయపడిన వారికి చికిత్స అందించారు. మరోవైపు బాధితులకు నీరు, టీ, ఆహార పొట్లాలను అందించేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే స్థానికులు ప్రయాణీకుల సామానులు భద్రపరిచి ,అనంతరం వారికి అప్పగించారు..

ముందుగా రెస్య్యూ టీమ్స్ రైల్వే కోచ్‌లలో ఇరుక్కుపోయిన 44 మంది బాధితులను రక్షించడంతోపాటు 71 మృతదేహాలను ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బయటకు తీశాయి. గ‌త రాత్రి నుంచి నిరాట‌కంగా కొనసాగిన స‌హ‌య కార్య‌క్ర‌మం శనివారం మధ్యాహ్నానికి దాదాపు పూర్తయినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు… మూడు వంద‌ల మంది వైద్యులు, 700 మంది పారామెడిక‌ల్ సిబ్బంది క్ష‌త‌గాత్రుల‌కు చికిత్స చేయ‌డంలో భాగ‌స్వాముల‌య్యాయి. తాత్కాలికంగా ప్ర‌మాద స్థ‌లంలోనే బెడ్స్ వేసి చికిత్స అందించారు.. అనంత‌రం మెరుగైన చికిత్స కోసం క‌ట‌క్ కు త‌ర‌లించారు.. 140 అంబులెన్స్ లో క్ష‌త‌గాత్రుల‌ను త‌ర‌లించ‌డంలో పాల్గొన్నాయి.. వేగంగా వైద్య సేవ‌లందంతో అనేక‌మంది ప్రాణాల‌తో బ‌య‌డ‌ప‌డ్డారు.. ఎక్కువ మ‌ర‌ణాలు బోగీలు నుజ్జు కావ‌డం వ‌ల్లే సంభ‌వించాయి..

- Advertisement -

కోర‌మండ‌ల్ ప‌ట్టాల త‌ప్పి గూడ్స్ రైలు ఢీకొట్టింద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు చెపుతున్నాయి.. కోర‌మండ‌ల్ స్పీడ్ కి బోగీలు గూడ్స్ ని ఢీకొట్టి ప‌క్క‌నే ఉన్న ట్రాక్ పై ప‌డ్డాయి.. అదే స‌మ‌యంలో య‌శ్వంత‌పూర్ ఎక్స్ ప్రెస్ అదే ట్రాక్ పై దూసుకువ‌చ్చి కోర‌మండ‌ల్ బోగీల‌పై ప‌డింది.. దీంతో అనేక మంది ప్ర‌యాణీకులు బోగీల‌లోనే న‌లిగి చ‌నిపోయారు.. ఇప్ప‌టికే భూమీలో కూరుకుపోయిన ఒక బోగిని తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.. ఇందులో మ‌రిన్ని మృత‌దేహాలు ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.. అలాగే ప్ర‌ధాన రైల్ ట్రాక్ ల‌ను క్లియ‌ర్ చేశారు.. మూడు రైళ్ల ట్రాక్ ల‌పై రాక‌పోక‌ల‌కు సేఫ్టీ క‌మిష‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.. దీంతో నేటి సాయంత్రం నుంచి ఈ మార్గంలో రైళ్ల రాక‌పోక‌లు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement