Friday, November 22, 2024

England: బ్రిటన్​ రాణి ఎలిజబెత్ ​హెల్త్​ సీరియస్​.. వైద్య పర్యవేక్షణలో ఉన్నారన్న బకింగ్​హామ్​ ప్యాలెస్​

బ్రిటన్ రాణి ఎలిజబెత్ II హెల్త్​ సీరియస్​గా మారింది. దీంతో డాక్టర్లు ఆమె ఆరోగ్యం తీరుపై ఆందోళన వ్యక్తం చేయడంతో గురువారం స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ కాజిల్ నివాసంలో వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది. ఆమె కుమారుడు, వారసుడు అయిన ప్రిన్స్ చార్లెస్, అతని భార్య కెమిల్లా- డచెస్ ఆఫ్ కార్న్ వాల్, మనవడు ప్రిన్స్ విలియం ఆమెతో కలిసి ఉండటానికి బాల్మోరల్‌కు వెళ్లినట్లు వారి క్లారెన్స్ హౌస్, కెన్సింగ్టన్ ప్యాలెస్ కార్యాలయాలు తెలిపాయి. 96 ఏళ్ల ఈ మహారాణి బాల్మోరల్‌లో వేసవి విహారంలో బాగానేఉన్నారని చెబుతున్నారు.

కాగా, ఇవ్వాల (గురువారం) ఉదయం క్వీన్స్ వైద్యులు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె వైద్య పర్యవేక్షణలో ఉండాలని సిఫార్సు చేశారని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది.  96 ఏళ్ల మహారాణి వయస్సు -సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, ఈ వారం ప్రారంభంలో స్కాట్లాండ్‌లో కొత్త ప్రధాన మంత్రి లిజ్ ట్రస్‌ను నియమించడంతో సహా ఆమె ప్రయాణాలను తగ్గించుకున్నట్టు తెలుస్తోంది.

ఈ లంచ్‌టైమ్‌లో బకింగ్‌హామ్ ప్యాలెస్ నుండి వచ్చే వార్తలతో దేశం మొత్తం తీవ్ర ఆందోళనకు గురవుతుందని నూతన ప్రధాని ట్రస్ ట్వీట్ చేశారు. నా ఆలోచనలు, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రజల ఆలోచనలు ఈ సమయంలో క్వీన్, ఆమె కుటుంబంతోనే ఉన్నాయని లిజ్​ ట్రస్​ చెప్పారు.   

Advertisement

తాజా వార్తలు

Advertisement