క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు ఇవ్వాల (సోమవారం) నిర్వహిస్తున్నారు. రాణి ఫైనల్ జర్నీ కొనసాగుతోంది. యువరాణి ఎలిజబెత్, ఫిలిప్ మౌంట్‌బెటన్ పెళ్లి రోజున పాడిన దైవ స్తుతులను అంత్యక్రియల వేళ జరిగిన నివాళి కార్యక్రమంలో కూడా ఆలపించారు. 1947లో క్వీన్ ఎలిజబెత్ పెళ్లి జరిగింది. అధికారిక లాంఛనాలతో ఎలిజబెత్‌కు తుది వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో జరిగిన ప్రార్థన సమయంలో.. ఆమె పెళ్లి రోజున పాడిన పామ్ 23కి చెందిన కొన్ని కీర్తనలను మరోసారి ఆలపించారు. ద లార్డ్ ఈజ్ మై షప్‌హార్డ్, ఐ విల్ నాట్ వాంట్ అన్న గీతాన్ని ఆలపించారు. గత ఏడాది ఏప్రిల్‌లో క్వీన్ ఎలిజబెత్ భర్త ఫిలిప్ చనిపోయారు.
వెస్ట్‌మినిస్టర్ అబ్బే బిల్డింగ్‌లో క్వీన్ ఎలిజబెత్-2కు ఇవ్వాల తుది నివాళి కార్యక్రమం జరిగింది. క్యాంట్‌బరీ ఆర్చిబిషష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే బిల్డింగ్‌లో ఆమె పెళ్లి, కిరీటధారణ కార్యక్రమాలు కూడా జరిగాయి. జెండాలతో కప్పి ఉన్న ఎలిజబెత్ శవపేటికను రాయల్ నేవీ సెయిలర్లు గన్ క్యారేజ్‌లో తీసుకువచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ అంత్యక్రియల్లో పాల్గొని నివాళి అర్పించారు.