క్వాడ్ సమావేశం రద్దయినట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ వెల్లడించారు. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లాల్సి ఉంది. అయితే జో బైడెన్ ఆస్ట్రేలియా పర్యటన రద్దయింది. దాంతో బైడెన్ లేకుండా క్వాడ్ సమావేశాన్ని నిర్వహించలేమన్నారు. అయితే హిరోషిమాలో జరగనున్న జీ7 సదస్సులో ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా, జపాన్ నేతలు కలుసుకోనున్నట్లు ఆయన చెప్పారు. జీ7 సంపన్న దేశాల జాబితాలో యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌తో పాటు ఇండియా, ఆస్ట్రేలియా కూడా ఉన్నాయి. మే 19వ తేదీ నుంచి మే 21 వరకు జీ7 భేటీ జరగనున్నది.
క్వాడ్ సమావేశాన్ని నిర్వహించలేకున్నా.. భారత ప్రధాని మోడీతో మాత్రం ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ తెలిపారు. ఇండో-పసిఫిక్ సముద్ర మార్గంలో కొత్త వ్యూహాత్మక మార్గాలను డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో క్వాడ్ దేశాలు పనిచేస్తున్న విషయం తెలిసిందే.
బైడెన్ లేకుండా క్వాడ్ సమావేశం నిర్వహించలేం.. ఆస్ట్రేలియా ప్రధాని
Advertisement
తాజా వార్తలు
Advertisement