భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచింది. ఇటీవల జరిగిన జర్మన్ ఓపెన్, ఆల్ఇంగ్లాండ్ ఓపెన్‌లో ఓడిన పీవీ సింధు స్విస్ ఓపెన్‌లో అదరగొట్టింది. ఈరోజు జరిగిన ఫైనల్లో బుసానన్‌పై 21-16,21-8తేడాతో విజయం సాధించి టైటిల్‌ను గెలుచుకుంది. 49 నిమిషాల పాటు సాగిందీ మ్యాచ్. దీంతో ఈ ఏడాది ఆమె ఖాతాలో రెండు టైటిల్స్ చేరాయి. ఈ ఏడాది ప్రారంభం జనవరిలో సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగానూ పీవీ సింధు గెలిచిన విషయం విదితమే.
Advertisement
తాజా వార్తలు
Advertisement