యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగానే కాదు హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ఆనంద్ దేవరకొండ. తనదైనశైలిలో విభినమైన కథా చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ని ఏర్పరుచుకుంటున్నాడు. దొరసాని,మిడిల్ క్లాస్ మెలోడీస్ తదితర చిత్రాలలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తాజాగా పుష్పక విమానం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ హీరో. మరి ఆ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం…
పుష్పక విమానం చిత్రాన్ని ఆనంద్ దేవరకొండ అన్న, హీరో విజయ్ దేవరకొండ స్వయంగా నిర్మించిన చిత్రం. డార్క్ కామెడీ మూవీగా కింగ్ ఆఫ్ ది హిల్స్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు దామోదర అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ సరసన శాన్వి మేఘన, గీత సైనీ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ప్రమోషన్స్ ఓ లెవెల్‌లో చేశారు. విజయ్ అంతా తానై ప్రమోషన్స్ ముందుండి నడిపిస్తూ ప్రేక్షకుల చూపును తమ సినిమావైపు తిప్పుకున్నారు. మరోవైపు టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నీ కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
పుష్పక విమానం నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ చిత్రం ఎలా ఉందంటే..ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా కామెడీకి పెద్ద పీట వేశారు. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉన్నా ఇంటర్వెల్ ముందు అంతా కూడా సుందర్ భార్య లేచిపోవడం, దాన్ని ఎవ్వరికీ తెలియకుండా కవర్ చేస్తుండటం, తన భార్యలా నటించేందుకు వేరే అమ్మాయిని తీసుకురావడం వంటి సీన్లతో సాగింది. ఇక సెకండాఫ్‌లో పోలీస్ ఆఫీసర్‌గా సునీల్ ఎంట్రీ ఇచ్చి విచారణ కొనసాగించడం లాంటి సీన్స్, అక్కడక్కడా కొన్ని ట్విస్ట్స్ ఇలా కథను ముందుకు తీసుకెళ్లాయి. ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ అని, చూడాల్సిన బొమ్మ అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేసేయొచ్చని మరికొందరు చెబుతున్నారు.
కాగా పుష్పకవిమానం చిత్రంలో నటీనటుల యాక్టింగ్ బాగుంది. ఇక దర్శకుడు కథను నడిపించిన విధానం, స్క్రీన్ ప్లే బాగుంది. మొత్తానికి ఈ సినిమాపై ప్రీమియర్స్ ద్వారా జనాల్లో యావరేజ్ ఒపీనియన్ ఏర్పడింది. ఆనంద్ దేవరకొండ ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రం..ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా చూడదగ్గ మూవీ. ఈ సినిమా చూడొచ్చు అనే టాక్ తెచ్చుకుందంటే..సగం సక్సెస్ అయినట్టే. మిగతా సగం వసూళ్ళ రూపంలో రావాల్సి ఉంటుంది. మొత్తానికి ఆనంద్ దేవర కొండ సినిమాలు ప్రేక్షకులని బాగానే థియేటర్స్ కి రప్పిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily