Saturday, November 23, 2024

‘పుష్ప‌2’ – హిందీ వెర్ష‌న్ షేర్ తీసుకోనున్న అల్లు అర్జున్

ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం పుష్ప‌. ఈ చిత్రం హిందీ వెర్షన్ 100 కోట్లకి పైగా రాబట్టడం విశేషం. అందువలన ఈ సారి తన పారితోషికంగా హిందీ వెర్షన్ షేర్ ను బన్నీ అందుకుంటున్నట్టుగా సమాచారం. ఎర్ర‌చంద‌నం నేపథ్యంలో సుకుమార్ ఈ కథను రెడీ చేసుకున్నాడు. ముఖ్యమైన పాత్రలను ఆయన డిజైన్ చేసుకున్న తీరు ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించింది. ప్రతి పాత్రకు ఆయన సెట్ చేసిన బాడీ లాంగ్వేజ్ .. మేనరిజమ్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. అలాంటి ఈ సినిమా కోసం బన్నీకి భారీ పారితోషికమే ముట్టిందనే టాక్ వచ్చింది. ఇక ‘పుష్ప 2’ విషయంలో బన్నీ ముందుగా పారితోషికం తీసుకోకుండా , హిందీ వెర్షన్ షేర్ ను మాట్లాడుకున్నాడ‌ట‌. అదే నిజమైతే బన్నీ తీసుకునే పారితోషికం కంటే ఎక్కువగానే వస్తుంది. రష్మిక కథానాయికగా కనిపించనున్న ఈ సినిమాలో, దిశా పటాని స్పెషల్ సాంగ్ హైలైట్ కానుందట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement