ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా పేరుతో చీరలు, షర్ట్ లు ఫేమస్ అవుతుంటాయి. కానీ గుజరాత్ లో పుష్ప చిత్రంలోని సీన్స్ ని చీరపై ఆవిష్కరించాడు ఓ వ్యాపారి. కాగా వ్యాపారులు పుష్పకు ఉన్న క్రేజ్ ను వాడుకుంటున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పుష్ప చీరలు వైరల్ అవుతున్నాయి. పుష్ప సినిమాలోని దృశ్యాలను చీరలపై ప్రింట్ చేసి అమ్ముతున్నారు. గుజరాత్ లోని సూరత్ క్లాత్ మార్కెట్ లో చరణ్ పాల్ సింగ్ వ్యాపారి ఆ సినిమా పోస్టర్లను పోలిన చీరలు తయారు చేయించారు.ఆ సినిమాలోని సన్నివేశాలు, ఫోటోలను చీరపై చూపించారు. ఈ విషయం తెలుసుకున్న మహిళలు ఆ చీరలను చూస్తూ భారీగా ఆర్డర్డు ఇస్తున్నారట. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఈ చీరలకు భారీగా ఆర్డర్డు వచ్చాయని ఆ వ్యాపారి చెప్పాడు. పుష్ప చీరలు రూపొందించి ఆ వ్యాపారి దేశ వ్యాప్తంగా పాప్యులారిటీ సంపాదించుకున్నాడు. దీంతో ఆయనతో పలు చానెళ్లు ఇంటర్వ్యూలు సైతం చేస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..