పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది పుష్ప. ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించాడు.. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికమందన జంటగా నటించారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఐటెం సాంగ్ లో మెరిసింది. కాగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం. ఇప్పటికే పుష్ప సినిమాపై వచ్చిన ఫస్ట్ రివ్యూ అల్లు అర్జున్ అభిమానుల్లో ఉత్సాహం నింపగా.. తాజాగా ఆడియన్స్ ఫస్ట్ రెస్పాన్స్ మరింత ఊపునిస్తోంది. ఈ సినిమా చూసిన జనం ఇది బన్నీ కెరీర్‌లోనే బెస్ట్ ఫిలిం అవుతుందని, ఈ చిత్రంలో ఆయన రోల్ నెవర్ బిఫోర్ అని పొగిడేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉందని, వెండితెరపై ఆయన యాటిట్యూడ్ మ్యానరిజం పీక్స్‌లో ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.
సందర్భానుసారంగా వచ్చే పోరాట సన్నివేశాలు, ఎలివేషన్స్ అదిరిపోయాయని, సినిమా చాలా బాగా వచ్చింది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా వర్కవుట్ కాలేదనే అభిప్రాయాలు వస్తున్నాయి.పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే..కాగా ఓవరాల్‌గా చెప్పాలంటే పుష్ప మొదటి భాగానికి ఎండ్ అనేది ఇవ్వలేదని, రెండో భాగం వస్తేనే సినిమా కంప్లీట్ అవుతుంది. రెండో భాగం కోసం వేచి చూడక తప్పదు. పుష్ప వన్ మ్యాన్ షో అని, ఇది అల్లు అర్జున్ బెస్ట్ ఫిలిం అవుతుందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. అల్లు అర్జున్ నటనతో పాటు ఇంటర్వెల్ సీన్స్, అలాగే క్లైమాక్స్ సీన్స్ ఈ సినిమాకు పాజిటివ్ పాయింట్ కాగా, అల్లు అర్జున్- రష్మిక నడుమ చిత్రీకరించిన కొన్ని సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెగెటివ్ పాయింట్స్ అని టాక్. ఊహించిన మేర హై మూమెంట్స్ కనిపించలేదట.
ఇక స్టార్ యాంకర్, నటి అనసూయ,నటుడు సునీల్ రోల్స్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సిందనిపిస్తోంది. రష్మిక మందన తన పాత్రకు న్యాయం చేసింది.. ఇక అల్లు అర్జున్ అన్ని షేడ్స్‌లో అదరగొట్టేశాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, స్లాంగ్, కామెడీ టైమింగ్, ఎమోషన్స్ అన్నీ బాగా కుదిరాయని అంటున్నారు. ఇకపోతే అంతా ఊహించినట్లుగానే సమంత స్పెషల్ సాంగ్ కేకలు పెట్టించింది. చివరి 20 నిమిషాల్లో విలన్ గా చేసిన ఫహద్ ఫాజిల్- అల్లు అర్జున్ నడుమ వచ్చే కొన్ని సీన్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి. మరి రెండోభాగం ఎలా ఉండనుందోనని బన్నీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..