ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు డెహ్రాడూన్‌లో ఆయనతో పాటు ఆయన మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో పోటి చేసిన సీఎం పుష్కర్ ధామి ఓడియారు. ఉత్తరాఖండ్‌లోని ఖతిమా నియోజకవర్గం నుంచి ఓడిపోయిన ధామీ.. సోమవారం ఉత్తరాఖండ్‌లో బిజెపి శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన రెండవసారి రాష్ట్ర పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం చేశారు. ధామితో పాటు మంత్రివర్గం కూడా ప్రమాణం చేయనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement