మహారాష్ట్రలోని నందుర్‌బార్ స్టేషన్ సమీపంలో గాంధీధామ్–పూరీ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. ఇవ్వాల ఉదయం 10.30 గంటలకు రైలు ప్యాంట్రీ కోచ్‌లో మంటలు చెలరేగాయని, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. నందుర్‌బార్ స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత పూరీ (ఒడిశా)కి వెళ్లే రైలు ప్యాంట్రీ కార్ నుండి మంటలు వ్యాపించాయని, వెంటనే అగ్నిమాపక దళాలు వచ్చి మంటలను ఆర్పేసినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్యాంట్రీ కారులో మంటలు రాగానే ఆ కోచ్‌ని రైలు నుంచి వేరు చేశామని, రైలు మొత్తం 22 కోచ్‌లతో ఉందని అధికారులు తెలిపారు. వెంటనే వైద్య బృందం, ఇతర పారామెడికల్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు సమీక్షించారు. మంటలు ఆర్పేశారు, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పశ్చిమ రైల్వే స్పష్టం చేసింది.