Tuesday, November 26, 2024

పురంద‌రే మ‌ర‌ణంతో మూగ‌బోయా..మోడీ ట్వీట్..ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు..

పురంద‌రే మ‌ర‌ణం త‌న‌కు మాట‌ల‌కు అంద‌ని బాధ‌ను క‌లిగించింద‌ని భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, పద్మవిభూషన్ అవార్డు గ్రహీత బాబా సాహెబ్ మరణించారు. ఆయ‌న మృతి పట్ల మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు మోడీ తన అధికారి ట్విటర్ లో ‘మాటలకందని బాధను అనుభవిస్తున్నాను. శివషాహీర్ బాబాసాహెబ్ పురంద‌రే.. మరణం చరిత్ర, సాంస్కృతిక ప్రపంచంలో అతి పెద్ద శూన్యతను మిగిల్చింది. రానున్న తరాలు ఛత్రపతి శివాజీ మహారాజ్ తో మరింత కనెక్ట్ అయ్యేలా చేసేందుకు గాను పురందరే చేసిన కృషికి కృతజ్ఞతలు. ఆయన ఇతర రచనలు కూడా గుర్తుండిపోతాయని సంతాపం వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగిన ఘనత నాకు లభించింది. కొన్ని నెలల క్రితం, ఆయన శతాబ్ది సంవత్సరపు కార్యక్రమంలో ప్రసంగిచాను’ అని మోదీ మరో ట్వీట్ లో తెలిపారు.

బాబాసాహెబ్ గా ప్రసిద్ధి చెందిన పురందరే సోమవారం పూణే (మహారాష్ట్ర)లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చేరారు. బాబా సాహెబ్ పురందరేను కేంద్ర ప్రభుత్వం 2019లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం ప‌ద్మ‌విభూష‌ణ్ తో .. 2015లో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర భూషన్ అవార్డుతో సత్కరించింది. పురందరే ఛత్రపతి శివాజీ మహారాజ్ మీద వివిధ పుస్తకాలను కూడా రాశారు. చరిత్ర పరిశోధనలకు తన జీవితాన్ని అంకితం చేశారు. బాబా సాహెబ్ ’జాంత రాజా‘ అనే నాటకాన్ని కూడా రాసి దర్శకత్వం వహించారు. దీనిని 200 మంది కళాకారులు ప్ర‌ద‌ర్శించారు..ప్రభుత్వ లాంఛనాలతో బాబా సాహెబ్ పురందరేకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement