జనవరి 5న పంజాబ్ ఫిరోజ్పుర్లో ర్యాలీ హాజరయ్యేందుకు వెళ్లిన ప్రధాని మోదీ పర్యటనలోనూ భద్రతా లోపం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన కాన్వాయ్ వెళ్లే రోడ్డును నిరసనకారులు దిగ్భందించారు. దీంతో 20 నిమిషాల పాటు మోదీ కారులోనే ఉండిపోయారు. అనంతరం ర్యాలీకి వెళ్లకుండా ఢిల్లీకి తిరుగుముఖం పట్టారు.
అయితే తాజాగా… కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం కనిపించింది. ఈ పర్యటనలో భద్రతా లోపం అధికారులను షాక్‌కు గురిచేసింది. రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారుపైకి ఓ యువకుడు జెండా విసిరేశాడు. ఆదివారం పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు రాహుల్ లుధియానా వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది. రాహుల్ హల్వారా నుంచి లుధియానాలో హయత్ రిజెన్సీ హోటల్‌కు వెళ్లే క్రమంలో హర్షిలా రిసార్ట్ చేరుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. దీంతో కారు అద్దాలు తీసి రాహుల్ అభివాదం చేశారు.
ఈ సమయంలోనే ఓ వ్యక్తి జెండాను రాహుల్ కారుపైకి విసిరాడు. రాహుల్ వెంటనే కిటికీ అద్దాలు మూసేశారు. ఈ సమయంలో రాహుల్ ప్రయాణిస్తున్న కారును కాంగ్రెస్ సీనియర్ నేత సునీల్ జఖార్ డ్రైవ్ చేస్తున్నారు. నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ, సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ కూడా కారులోనే ఉన్నారు. ఈ ఘటనను చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు. జెండా విసిరిన యువకుడు ఎన్ఎస్యూఐ కార్యకర్త అని, అతడు జమ్ముకశ్మీర్‌కు చెందిన వాడని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..