Friday, November 22, 2024

AAP: పంజాబ్​ గొప్ప నిర్ణయం.. ఇంటింటికీ ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యత్​!

పంజాబ్​లోని ఆమ్​ ఆద్మీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. జులై 1నుంచి ఉచిత విద్యుత్​ అందిస్తామన్న ఎన్నికల హామీ నిర్ణయానికి కట్టుబడి ఇవ్వాల్టి (శుక్రవారం) నుంచి ఉచిత విద్యుత్​ అందిస్తున్నట్టు ప్రకటించింది. ప్రతి ఇంటికి 300 యూనిట్ల మేరకు ఫ్రీగా విద్యుత్​ సప్లయ్​ చేయనున్నట్టు సీఎం భగవంత్​ మాన్​ ప్రకటించారు.

ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల విద్యుత్‌ను ప్రతి నెల ఉచితంగా అందించడంలో పంజాబ్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రశంసించారు. శుక్రవారం సోషల్ మీడియా వేదికగా సీఎం మాట్లాడుతూ.. “పంజాబ్ చరిత్రలో మా ప్రభుత్వం ఒక కొత్త ఉదాహరణను నెలకొల్పింది. ఈ రోజు మేము పంజాబీలకు ఇచ్చిన మరో హామీని నెరవేర్చబోతున్నాము” అని తెలిపారు.

గత ప్రభుత్వాలకు హామీలు నెరవేర్చేందుకు ఐదేళ్లు పట్టేదని పంజాబ్ ముఖ్యమంత్రి అన్నారు. జులై 1 నుంచి ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని ఆప్ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ప్రతి నెలా ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించడం 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన కీలక వాగ్దానాలలో ఒకటి. ఆప్‌ నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా మాట్లాడుతూ.. ప్రజలకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్న రెండో రాష్ట్రంగా ఢిల్లీ తర్వాత పంజాబ్‌ నిలిచిందన్నారు.

“ఢిల్లీ తర్వాత గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తును అందిస్తున్న రెండో రాష్ట్రంగా పంజాబ్ నిలిచిందని, ఈరోజు చారిత్రాత్మకమైన రోజుగా చద్దా తెలిపారు. పంజాబీలకు ‘కేజ్రీవాల్ డి పెహ్లీ (మొదటి) హామీ’ వాస్తవం అవుతుంది” అని చద్దా ట్వీట్ చేశారు. ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా జూన్ 27న ఆప్-ప్రభుత్వ తొలి బడ్జెట్‌ను సమర్పిస్తూ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.1,800 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు.

పంజాబ్ పౌరులందరికీ నెలకు 300 యూనిట్ల గృహ విద్యుత్ సరఫరాను ఉచితంగా అందించడం ద్వారా AAP ప్రభుత్వం పంజాబ్ ప్రజలకు చేసిన మొదటి హామీని నెరవేరుస్తోంది. ఇది పంజాబీలకు పెద్ద ఊరటనిస్తుంది. వృధా ఖర్చులను తగ్గించడం ద్వారా, సొంత పన్ను ఆదాయాన్ని పెంచడం ద్వారా ఈ పథకానికి ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యోచిస్తోందని ఆయన చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement