Wednesday, November 20, 2024

Weather: ఇగం పట్టిన ఉత్తరాది.. చలిగాలులతో వణుకుతున్న పంజాబ్, హర్యానా

పంజాబ్, హర్యానా రాష్ట్రాలు చలిగాలులతో వణికిపోతున్నాయి. శుక్రవారం ఆ రాష్ట్రాల్లోని పలు ఏరియాల్లో అతిశీతల వాతావరణం నెలకొంది. హర్యానాలోని హిసార్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని, కనిష్ట ఉష్ణోగ్రత 4.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. సిర్సా ఏరియాలో రాత్రివేళ ఉష్ట్రోగ్రతలు మరింత పడిపోయాయి. అత్యల్పంగా 5.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. గుర్గావ్ కనిష్ట ఉష్ణోగ్రత 7.5 డిగ్రీల సెల్సియస్ గా ఉంది.అయితే, అంబాలాలో సాధారణం కంటే 10.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

పంజాబ్‌లోని భటిండాలో తీవ్రమైన చలితో జనం అల్లాడిపోతున్నారు. అక్కడ 4.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అమృత్‌సర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 7.8 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. గురుదాస్‌పూర్‌లో కూడా రాత్రి చల్లటి వాతావరణమే ఉంది, కనిష్టంగా 5.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. జలంధర్‌లో 8.6 డిగ్రీలు, మోగాలో 5.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లూథియానాలో కనిష్ట ఉష్ణోగ్రత 8.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లో 11 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement