ప్రభుత్వ ఆఫీసుల్లో పని వేళలను మార్చేసింది పంజాబ్ గవర్నమెంట్. సాధారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే ఆఫీసు వేళలను.. ప్రజల ప్రయోజనాల కోసం ఉదయం 7.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరవనున్నారు. ఆఫీసు టైమ్‌ను మార్చిన నేపథ్యంలో.. మంగళవారం పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సింగ్ .. తొందరగానే ఆఫీసుకు వచ్చారు. భగవంత్‌మాన్ సర్కార్‌లోని మంత్రులు అమన్ అరోరా, బ్రహ్మ శంకర్ జింపా, హర్భజన్ సింగ్, కుల్దీప్ సింగ్, దలీవాల్ కూడా ఉదయం 7.30 నిమిషాలకే ఆఫీసులకు వెళ్లారు. తెల్లవారుజామునే ఆఫీసుకు వెళ్లడం వల్ల విద్యుత్తును ఆదా చేయవచ్చు అని సీఎం మాన్ తెలిపారు. ప్రస్తుతానికి పవర్ షార్టేజీ ఏమీ లేదని, కానీ ఉదయమే ఆఫీసులకు వెళ్లడం వల్ల దాదాపు రోజుకు 350 మెగా వాట్ల విద్యుత్తును ఆదా చేయవచ్చు అన్నారు. విద్యుత్తు బిల్లులను తగ్గిస్తే, రాష్ట్ర ఖజానాకు దాదాపు నెలకు 17 కోట్ల వరకు బిల్లు ఆదా చేసినట్లు అవుతుందన్నారు. పరిశ్రమలు, గృహ వినియోగదారులకు కరెంటు కోతలు ఉండవన్నారు. వరి పంటకు అందించేందుకు కావాల్సినంత విద్యుత్తు ఉందన్నారు.దాంతో ఈ కీలక నిర్ణయాన్ని అమలు పరిచారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement