Wednesday, November 20, 2024

IPL 2022: టైటాక్స్ కు కింగ్స్ బ్రేక్.. గుజరాత్ పై పంజాబ్ భారీ విజయం

ఐపీఎల్‌ సీజన్‌ 2022 ఆసక్తికరంగా సాగుతోంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న గుజరాత్ టైటాన్స్‌కు పంజాబ్ కింగ్స్ బ్రేకులు వేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 8 వికెట్లతో టైటాన్స్‌పై విజయం సాధించింది. తొలుత టైటాన్స్‌ను 143 పరుగులకే కట్టడి చేసిన పంజాబ్.. ఆపై రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

ఓపెనర్ జోస్ బట్లర్ (1)ను టైటాన్స్ బౌలర్లు త్వరగానే పెవిలియన్ పంపారు. అయితే,  శిఖర్ ధావన్-భానుక రాజపక్స ఇద్దరూ యథేచ్ఛగా షాట్లు ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపించారు. ఈ క్రమంలో 28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 40 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. శిఖర్‌ ధవన్‌ 53 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 62 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు. లివింగ్ స్టోన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. ఫలితంగా మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ విజయాన్ని అందుకుంది. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. సుదర్శన్‌ 50 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65 రన్స్ తో నాటౌట్‌గా నిలిచాడు. జట్టులో ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారు. కెప్టెన్ పాండ్యా ఒక్క పరుగుకే అవుట్ కాగా, మిల్లర్ 11, రాహుల్ తెవాటియా 11 పరుగులు చేశారు. దీంతో టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది.  నాలుగు వికెట్లు తీసి టైటాన్స్ కొంపముంచిన కగిసో రబడకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement