Thursday, November 21, 2024

పంజాబ్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

పంజాబ్​ కాంగ్రెస్ లో పరిణామాలు వేగంగా మారతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన రోజుల వ్యవధిలోనే పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడంతో సంక్షోభం నెలకొంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? అన్నది అర్ధం కాని పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని సీనియర్లు భావిస్తున్నారు.

పంజాబ్ లో చోటుచేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ అత్యవసరంగా కేబినెట్​ భేటీ ఏర్పాటు చేశారు. మరోవైపు పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్​ రాష్ట్ర ఇంఛార్జ్​ హరీశ్​ రావత్​ బుధవారం ఢిల్లీ నుంచి పంజాబ్​కు వెళ్తుత్నారు. ఈ సందర్భంగా సిద్ధూతో భేటీ  అయి తాజా పరిస్థితిపై చర్చించన్నారు. తన రాజీనామాను వెనక్కి తీసుకునేలా బుజ్జగించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: పంజాబ్ లో కీలక పరిణామం.. పీసీసీ పదవికి సిద్ధూ రాజీనామా

Advertisement

తాజా వార్తలు

Advertisement