పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింఘ్లాను మంత్రివర్గం నుంచి తొలగించారు. మంత్రి విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలు రావడంతో పదవి నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా మంత్రిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన సీఎం కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. టెండర్ల కోసం సింగ్లా ఒక శాతం కమీషన్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. అంతేగాక తాను చేసిన తప్పులను సింఘ్లా ఒప్పుకున్నట్లు కూడా తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఒక్క శాతం అవినీతిని కూడా తాము ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మంత్రికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై తమవద్ద సమాచారం వుందని, వాటిపై విచారణ చేయిస్తామని సీఎం చెప్పారు. ఇక ఆరోగ్యశాఖమంత్రిపై కేసు నమోదు చేయాలని పంజాబ్ పోలీసులను ఆదేశించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement