సీఎంగా బాద్యతలు చేపట్టిన నాటి నుంచి ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తున్నారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. రీసెంట్ గా లంచం అడిగారనే ఆరోపణలు రావడంతో గత మంగళవారం ఏకంగా మంత్రినే క్యాబినెట్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని 424 మంది ప్రముఖులకు ప్రభుత్వం కల్పించిన భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. వారిలో పదవీ విరమణ పొందిన పోలీసులు, మత నాయకులు, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. ఏప్రిల్ నెలలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సహా 184 మందికి భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వీరిలో పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కుటుంబ సభ్యులు, అమరిందర్ సింగ్ కుమారుడు, అతని భార్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ సింగ్ బజ్వావర్ కూడా ఉన్నారు. భగవంత్ మాన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు కూడా హర్షిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement